కమల్ హాసన్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో అదేవిధంగా రొమాంటిక్ హీరో కూడా ఉన్నాడు. కమల్ హాసన్ తన సినిమాలలో హీరోయిన్ కు ముద్దులు పెట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అప్పట్లో “హే రామ్” సినిమాలో కమల్ హాసన్ పెట్టిన ముద్దులు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతున్న “విశ్వరూపం 2” సినిమాలో కూడా కమల్ హాసన్ ముద్దుల జడివాన ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై కమల్ కూడా క్లారిటీ ఇస్తూ విశ్వరూపం మొదటి భాగం అంత యాక్షన్ సీక్వెన్స్ తోనే నడిచిందని, రెండవ భాగంలో రొమాంటిక్ సీన్స్ కి కూడా స్థానం ఉందని చెప్పి ప్రేక్షకులకు చిన్న హింట్ ఇచ్చాడు. ఈ వయస్సులో కూడా కమల్ హీరోయిన్ ను వదలకుండా ముద్దులు పెడుతూ కుర్ర హీరోలకి ధీటుగా నిలుస్తున్నాడు.