సెప్టెంబర్ 27న నాగార్జున – నాని కాంబినేషన్ లో విడుదలకు సిద్ధమైన “దేవదాస్” సినిమాపై కౌశల్ ఆర్మీ సభ్యులు ఆగ్రహముగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలో కౌశల్ ఆర్మీ నాని సినిమాను ప్లాప్ చేసి తీరుతుందని, కౌశల్ పట్ల నాని వైఖరి తేడాగా ఉందని ఆర్మీ సభ్యులు తెలియచేస్తున్నారు. బిగ్ బాస్ 2 లో ప్రారంభంలో కౌశల్ పై కొంత మంది సభ్యుల ప్రవర్తనకు వ్యతిరేకంగా కౌశల్ కు బయట “కౌశల్ ఆర్మీ” పేరుతో ఒక గ్రూప్ గా ఏర్పడి బిగ్ బాస్ 2 ను శాసించే స్థాయికి తీసుకొని వెళ్లారు.

కౌశల్ కు ఎవరైతే యాంటీగా ఉంటారో వారిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించే పనిలో కౌశల్ ఆర్మీ బాగానే సక్సెస్ అయింది. ఇందులో భాగంగా కౌశల్ కు బిగ్ బాస్ 2లో ఉన్న ఒకే ఒక్క సపోర్టర్ నూతన నాయుడుని గత వారం బిగ్ బాస్ 2 నుంచి అన్యాయంగా బయటకు పంపించడంపై కౌశల్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బిగ్ బాస్ 2 రూల్స్ ప్రకారం ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారం జరుగుతుంది. ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగితే గణేష్, అమిత్ ఎలిమినేట్ అవ్వవలసి ఉంది. కానీ ఓటింగ్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉన్న నూతన నాయుడుని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ మేనేజ్మెంట్ తన క్రెడిబిలిటీని ప్రశ్నర్ధకంగా మార్చుకుంది.

దీనితో కౌశల్ ఆర్మీ సభ్యులు బిగ్ బాస్ ఇంటి లోపల కౌశల్ కు ఎవరూ సపోర్టర్స్ ఉండ కూడదన్న కారణంతో నూతన నాయుడుని ఎలిమినేట్ చేసారని ఆరోపిస్తున్నారు. ఇలా ఎలిమినేట్ చేయడంలో నాని హస్తం కూడా ఉందని బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిపై ఫైర్ అవుతున్నారు. దీనిపై ఇప్పటికే నాని నిన్న ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, బిగ్ బాస్ హౌస్ లో అందరూ నాకు సమానమేనని, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని లేదని స్పందించవలసి వచ్చింది. నాని స్పందన బట్టే నాని కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎంత డిస్టర్బ్ అయ్యాడో తెలుస్తుంది. నాని స్పందించే ముందు బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ బాస్ హౌస్ గురించి ఎలాంటి ప్రకటన చేయవద్దని చెప్పిందని, కానీ తన కెరీర్ కొంత ఇబ్బందులలో పడుతుందని వెంటనే తన ట్విట్టర్ వేదికగా నాని స్పందించినట్లు తెలుస్తుంది. నాని సినిమా ప్లాప్ చేస్తామని చెప్పే ఆర్మీ సభ్యులు సినిమా బాగుంటే ఆర్మీతో సంబంధం లేకుండా ఎవరైనా చూస్తారన్న విషయం మర్చిపోయి, ఇలా సినిమా ప్లాప్ చేస్తామని శపధాలు చేయడమేమిటో అర్ధం కావడం లేదు. అసలు నానికి బిగ్ బాస్ యాజమాన్యానికి సంబంధమే ఉండదని, నాని ఒక హోస్ట్ మాత్రమే, బిగ్ బాస్ ఉంచమన్న వాళ్ళని ఉంచి, ఎలిమినేట్ చేయమన్న వారిని ఎలిమినేట్ చేయడమే నాని చేయవలసిన పని, దీనిపై నాని మీద కోపడితే ఏమొస్తుంది కౌశల్ ఆర్మీ సబ్యులకే తెలియాలి.