తెలుగు ఇండస్ట్రీకి నూతనంగా పరిచయమవుతున్న శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ “కవచం” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారు. కానీ ఆరోజు తెలంగాణాలో ఎన్నికలు జరగనుండటంతో తేదిని మార్చుకోవాలని చూస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేకపోయినా తెలంగాణాలో ఎన్నికలు ఉండటంతో నైజామ్ ఏరియాపై ప్రభావం చూపుతుందని “కవచం” టీం సినిమాను డిసెంబర్ 14వ తారీకుకి పోస్ట్ పోన్ చేసుకున్నారు.

థ్రిల్లర్ సినిమాగా వస్తున్న “కవచం” సినిమా టీజర్ ఇటీవల విడుదలవ్వగా మిలియన్ వ్యూస్ తో మంచి స్పందన రాగా సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచేసింది. బారి బడ్జెట్ వైపు చూడకుండా సాధారణ బడ్జెట్ లో వస్తున్న “కవచం” సినిమాపై బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బారి అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు జోడిగా కాజల్ నటిస్తుండగా, రెండ హీరోయిన్ గా మెహ్రాన్ నటిస్తుంది. వంశదాహర క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంఠినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చోట కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి