‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి న్యూ లుక్ బయటకి వచ్చింది. ఆర్జీవీ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రకటన చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిగా ఎవరు కనిపించబోతున్నారని చాలా రోజులుగా చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో అనేక పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నటిస్తుందని చెప్పిన వర్మ.. ఆ పాత్రకు సంబంధించి పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను వర్మ విడుదల చేయగా అవి రెండు మంచి పాపులర్ అయ్యాయి. బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించని నిజాలను ఈ సినిమాలో చూపిస్తానంటున్న వర్మ. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు.