రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా బిజినెస్‌ పరంగా కూడా సంచలనాలు నమోదు చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తానికి సినిమాను అమ్మేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను చిత్రం యూనిట్ ఖండించారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్నీ పుకార్లని చిత్ర యూనిట్ కొట్టిపారేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 22 న అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్‌ రావటంతో సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.