ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం ‘కథా నాయకుడు’ విడుదలయి యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమా ప్రీ- రిలీజ్ బిజినెస్ ను బాగానే చేసినప్పటికీ, రిలీజ్ తరువాత మాత్రం బయ్యర్స్ ని నష్టాలలోకి లాగేసింది. దీనితో ఈ సినిమా రెండవ భాగం అయిన ‘మహా నాయకుడు’ సినిమా ని బయ్యర్స్ కి ఫ్రీ గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట.

మొదట భాగంతో డిస్టిబ్యూటర్స్ భారీగా నష్టపోవడంతో బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ సినిమా షూటింగ్ ఇంకా 15 రోజులు మిగిలి ఉంది. మహానాయకుడిలో మొత్తం ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావనే ఉండబోతుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మస్తున్నారు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది.