విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కార్. ఈ సినిమా రెండు రోజులలోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు కొల్లకొట్టింది. మురుగుదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై హీరో మహేష్ బాబు తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేసారు. ‘సర్కార్’.. అద్భుతమైన పొలిటికల్‌ డ్రామా చిత్రం. సినిమాను చాలా బాగా ఎంజాయ్‌ చేశాను. సినిమాలో మురుగదాస్‌ మార్క్‌ స్పష్టంగా కనిపించింది. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు’ అని మహేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.‌ కాగా మహేశ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌లో ‘స్పైడర్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.