Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 మూవీ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు. మహేష్ బాబు అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం సిద్ధమైపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మూడేళ్ళ వరకు రాజమౌళి ప్రాజెక్ట్ నుంచి బయటకి రాలేకపోవచ్చు. ఏదైనా కొత్త మూవీ ఒప్పుకున్న కూడా 3 ఏళ్ళ వరకు స్టార్ట్ చేయకపోవచ్చనే మాట వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు ఇంకో టాక్ తెరపైకి వచ్చింది.ఇప్పుడు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కంటే ముందుగా మరొక సినిమా చేయొచ్చని ప్రచారం నడుస్తోంది. అది కూడా నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఈ సినిమా చేస్తాడనే టాక్ వస్తోంది.
తాజాగా ఓ టీవీ షోలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ విషయాన్ని చెప్పారు. వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేర్కొన్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలకృష్ణ కలిసి నటిస్తే కచ్చితంగా అది సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కి కూడా గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే మూవీ అవుతుంది. థమన్ చెప్పినట్లు మహేష్, బాలయ్య కలిసి నటిస్తే ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది. దర్శకుడు ఎవరు అనే క్లారిటీ రావాల్సి ఉంది. థమన్ వరకు ఆ న్యూస్ వచ్చిందంటే కచ్చితంగా ఎవరో స్టార్ దర్శకుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేసి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.
బాలకృష్ణ కూడా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. గతంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో బాలకృష్ణ కీలక పాత్రలో నటించాడు. అతని ఎనర్జీకి సరిపోయే పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ని దర్శకులు డిజైన్ చేయడం లేదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ ఇమేజ్, బాలకృష్ణ మాస్ ఇమేజ్ ని తెరపై చూపిస్తే మాత్రం కచ్చితంగా అది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి థమన్ చెప్పినట్లు ఈ కాంబినేషన్ మూవీ సెట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి