Bigg Boss 8: హౌస్‌లోని కంటెస్టెంట్ల మధ్య గొడవలు, పొట్లాటలు, రొమాన్స్, లవ్ స్టోరీలు ఇలా రకరకాల ఆసక్తికర సంఘటనలను చూపిస్తూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అన్ని భాషల కంటే తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ అయిన ఈ షోని మేకర్స్ మరింత రంజుగా నడిపిస్తున్నారు. ఇప్పటికే చాలా సీజన్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎనిమిదో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్లో హైలెట్ అయిన యష్మీ గౌడ తాజాగా ఓ కంటెస్టెంట్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
సెప్టెంబర్ 1న ప్రీమియర్ ఎపిసోడ్‌తో బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్లు పాటలు, డ్యాన్సులు, కామెడీ చేస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ఇది ఇన్ఫినిటీ ఎంటర్ టైన్ మెంట్ సీజన్ కాబట్టి.. మొదటి నుండి ఈ షోలో చాలా ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. గతానికి భిన్నంగా కొత్త పద్ధతిలో ఈ సీజన్ నడుస్తోంది. మిగతా అన్నింటితో పోలిస్తే బిగ్ బాస్ షోలో నామినేషన్ టాస్క్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడమే ఇందుకు కారణం. ఎనిమిదో సీజన్ మూడో వారంలో కూడా నామినేషన్లన్నీ హోరెత్తాయి. ఇందులో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇది రంజుగానే సాగింది.
ఈ వారం జరిగిన నామినేషన్స్ టాస్క్‌లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన యష్మీ గౌడ, నాగ మణికంఠల మధ్య పెద్ద ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ సీజన్‌లో ఎన్ని వారాలు ఉంటాయో ప్రతి వారం మణికంఠను నామినేట్ చేస్తానని చెప్పింది యష్మీ. దీంతో వీరి పోరు చాలా కాలం సాగేట్లు అనిపిస్తుంది. యష్మీ గౌడతో గొడవ పడిన తర్వాత నాగ మణికంఠ ఆమె వద్దకు వెళ్లి వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. అంతేకాదు, ‘నామినేషన్ల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు’ అని అన్నారు. తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఈ విషయాన్ని చూపించారు. ఆ సమయంలో యష్మీ గౌడ చాలాసేపు ఏడుస్తూ కనిపించింది. అలాగే, ‘నాకు కంఫర్ట్ లేదని చెప్పినా హగ్ చేసుకుంటున్నాడు’ అని చెప్పింది.
ఆ తర్వాత కంటెస్టెంట్ల అందరీకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అందులో రెండు స్టాండ్స్ మీద ఫోటోలు పెట్టాలి. ఆ తర్వాత నబీల్ ఒక జట్టు తరపున, పృథ్వీ మరో జట్టు తరపున పోటీ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఎమోషనల్ గా, రసవత్తరంగా సాగింది.