సంతోష్ శివన్ దర్శకత్వంలో మలయాళంలో ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమా తెరకెక్కుతున్నది. కాళిదాస్ జయరాం సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ మంజూ వారియర్ గాయపడింది. యాక్షన్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఆమె తలకు బలమైన గాయం అవ్వడంతో సిబ్బంది వెంటనే ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. గాయానికి కుట్లు వేసినట్టుగా సమాచారం. మంజూ వారియర్ కోలుకున్నాక తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందని యూనిట్ తెలియజేసింది.