ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మను’. షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాజా గౌతమ్, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 7 న విడుదల కానుంది.