తమ కొత్త సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా మీడియా వారిని పిలిచి, టైంకు రాకుండా విసింగించడం ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కు పరిపాటిగా మారింది. ఇలాంటి పరిణామమే ఈరోజు ప్రసాద్ లాబ్స్ వేదికగా జరిగింది.  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిర్మితమై ఈనెల 7వ తారీకు రిలీజ్ కు సిద్ధమవుతున్న “కవచం” సినిమాకు సంబంధించి ప్రసాద్ లాబ్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు మీడియా వారితో కాజల్ ఇంటర్వ్యూ ఉండటంతో అందరూ 10 గంటలు ప్రసాద్ లాబ్స్ కు చేరుకున్నారు. కానీ కాజల్ తాపీగా 11.45 నిమిషాలకు ప్రసాద్ లాబ్స్ కు రావడంతో మీడియా సభ్యులు బాయ్ కాట్ అని చెప్పి నిరసన వ్యక్తం చేసి అక్కడ నుంచి నిష్క్రమించారు. దీంతో కంగుతిన్న కాజల్ ఏమి చేయాలో అర్ధం కాక మిన్నకుండిపోయింది. అమ్మడు 10 గంటలకు అని చెప్పి దాదాపుగా రెండు గంటలు ఆలస్యంగా రావడంతో అక్కడ ఉన్న మీడియా సభ్యులు ప్రతి ఒక్కరకి మీడియా అంటే అలుసైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.