ప్రముఖ నిర్మాత సుబ్బిరామి రెడ్డి కొన్ని రోజుల క్రితం చిరంజీవి – పవన్ కళ్యాణ్ ఇద్దరు కలసి త్వరలో నటించనున్నారని, దాని కోసం మల్టీస్టారర్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలియచేసారు. ఇది చెప్పి కూడా ఇప్పటికే సంవత్సర కలం దాటి పోతుంది. కానీ నిన్న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా మరలా ఈ చర్చ మరొకసారి చర్చకు వచ్చింది. సుబ్బిరామి రెడ్డి ఆరోజు చేసిన ప్రకటన తప్పితే ఇంత వరకు కథ, దర్శకుడు ఇవేమి ఫైనల్ అవ్వలేదని, పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయాలలో బిజీగా ఉన్నాడని, చిరంజీవి సైరా సినిమా షూటింగులో బిజీగా ఉంటూ, ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

పవన్ – చిరంజీవి సినిమా అటకెక్కినట్లే అని, చిరంజీవి 2020 వరకు తన కాల్షీట్స్ ఖాళీ లేవని, పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత సినిమాలు చేస్తాడో చేయడో అన్న విషయం తెలియదు. అలాంటి సందర్భంలో అభిమానులు ఇంకా పవన్ కళ్యాణ్ – చిరంజీవి సినిమాపై ఆశలు పెట్టుకుకోవడం అత్యాశే అవుతుంది. సుబ్బిరామి రెడ్డి ఇద్దరు మెగా హీరోలను ఒకే సినిమాలో చూపించాలన్న కుతూహలం ఎప్పటికి నెరవేరుతుందో, దీనిపై సుబ్బిరామిరెడ్డినే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది.