అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా దీపావళి పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన అఖిల్ కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుత ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. బీ వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.