నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్‌టీఆర్‌’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక పూర్తై శర వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమౌతున్నాడు. మూడేళ్ళ క్రితమే మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొద్దామని అనుకున్నా… కొన్ని కారణాల వలన కుదరలేదు. బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేద్దమనుకుని అది సరైన సమయం కాదు అనుకుని వెనక్కు తగ్గారు.

ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్న సంగతి తెలిసిందే. యువ ఎన్టీఆర్‌కు జోడిగా రకుల్‌ ప్రీతి సింగ్ జతకట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రకుల్‌ ఎన్టీఆర్‌కు పాలు అమ్మే మహిళ పాత్రలో మోక్షజ్ఞతో నటించబోతుంది. మోక్షజ్ఞ రోల్ 15 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags: NTRBiopic, Nandamuri Balakrishna, Mokshagna, Rakul Preet Singh, Tollywood