కిర్రాక్ పార్టీ తర్వాత నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముద్ర”. ఈ మూవీ లో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన కణిథన్‌ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. టి ఎన్ సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన వర్కింగ్ స్టిల్స్ కు పాసిటివ్ రెస్పాన్ వచ్చింది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాని నవంబర్ 8 న రిలీజ్ చేయబోతున్నారు.