శ్రీమంతుడు, జనతా గ్యారెజ్‌, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌. ప్రస్తుతం ఈ సంస్థ నాగచైతన్య, రవితేజాలతో సినిమాలు నిర్మిస్తుంది. నాగ చైతన్యతో సవ్యసాచి, రవితేజతో అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. సవ్యసాచి మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ లను మైత్రి మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది. సవ్యసాచి సినిమాను నవంబర్‌ 2న , అమర్‌ అక్బర్‌ ఆంటోని మూవీని అక్టోబర్‌ 5న రిలీజ్‌ చేయనున్నారు. అలాగే మహేష్‌బాబు 26వ సినిమాను సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.