కింగ్ నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టార్ చిత్రం ‘దేవదాస్’ . లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ లును రిలీజ్ చేసారు. నాగ్‌, నాని పక్కపక్కన పడుకుని ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దీన్ని నాగార్జున ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. సాధారణంగా పారు నా పక్కన ఉండేది. కానీ ఈ సారి ఈ దాస్ పక్కన ఇరుక్కున్నా’ అంటూ కోపంతో ఉన్న ఎమోజీని పోస్ట్‌ చేశారు. ఇక హీరో నాని.. ‘1996లో నిన్నే పెళ్లాడతా సినిమా టైమ్‌లో నాగ్‌ సర్‌ తెరపై ఉన్నారు. నేను దేవి థియేటర్‌లో క్యూలో ఉన్నాను. 2018లో దేవ్‌దాస్‌లో మేమిద్దరం ఇలా తాగి పడుకున్నామంటూ.. నాని తన ట్విట్టర్ లో ట్వీట్‌ చేశాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ కానుంది.