‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘సవ్యసాచి’ చిత్రాలతో నిరాశ పరిచాడు నాగ చైతన్య. అయినా కానీ చైతూకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం చైతు నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. నాగచైతన్యకు జోడిగా సమంత నటిస్తుంది. కాగా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వారు 6 కోట్ల కు కొనుగోలు చేశారు. ఎంత భారీ మొత్తం పెట్టడానికి కారణం సమంత, నాగ చైతన్య లు కలిసి చేయడం. పెళ్లి తర్వాత మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్లో రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

‘నిన్నుకోరి’ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గ‌ర‌పాటి, హరీష్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.