గత నెల రోజులుగా మెగా కుటుంబానికి చెందిన యాక్టర్ నాగబాబు ఇండైరెక్ట్ గా నందమూరి బాలకృష్ణ మీద వేస్తున్న సెటైర్స్ కు ఇద్దరు ఫాన్స్ సోషల్ మీడియా సాక్షిగా తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. గత వారం నాగబాబు చెన్నైలో ఒక కార్యక్రమానికి హాజరైన నాగబాబుని వేదిక మీద మాట్లాడనివ్వకుండా నందమూరి అభిమానులు చేసిన రచ్చ అంత ఇంతా కాదు. కానీ నాగబాబు ఆ గొడవలతో కూడా మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా విఫలం కావడంతో స్టేజి దిగి వెళ్లిపోయారు.

ఇప్పుడు నాగబాబు బాలకృష్ణను తాను ఎందుకు విమర్శిస్తుందో చెప్పడానికి వీడియో బైట్ లు విడుదల చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులలో బాలకృష్ణ హీరోగా “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో నాగబాబు బయటకు వచ్చి గత నాలుగైదు సంవత్సరాలుగా బాలకృష్ణ తమ కుటుంబాన్ని ఎలా విమర్శించాడో అంటూ, కామెంట్ – 1, కామెంట్ 2 అంటూ వీడియోలు విడుదల చేస్తూ అభిమానుల మధ్య అగ్గిని మరికొంత రాజేస్తున్నారు.

నాగబాబు వ్యాఖ్యలతో మెగా అభిమానులెవ్వరు ” ఎన్టీఆర్ బయోపిక్” సినిమా చూడకుండా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు బాలకృష్ణ మీద విమర్శలకు దిగుతున్నాడా అనిపిస్తుంది. బయోపిక్ సినిమా విడుదలైన మరో రెండు రోజులకు మెగా హీరో రామ్ చరణ్ సినిమా విడుదల కూడా అవ్వనుంది. రామ్ చరణ్ సినిమాపై కూడా నందమూరి అభిమానులు కూడా మొదటి ఆట నుంచే ప్లాప్ టాక్ స్ప్రెడ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఇండస్ట్రీ రెండుగా చీలే ప్రమాదం దాగి ఉంది. బాలకృష్ణ వ్యాఖ్యలు చేసినప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు రియాక్ట్ అవ్వడంతో మనసులో ఏదో పెట్టుకొని ఒక పక్క పధకం ప్రకారం మెగా కుటుంబం నుంచి నాగబాబు టార్గెట్ చేస్తున్నదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఇంకెంత దూరం వెళ్తాయోనని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు.