నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సవ్యసాచి. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సోమవారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. మాధవన్, భూమిక కీలక పత్రాలు పోషిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్లో విదుదలకానుంది.