నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా వచ్చిన “చిలసౌ” సినిమా అడవి శేష్ హీరోగా వచ్చిన “గూఢచారి” రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీటిలో సుశాంత్ నటించిన “చిలసౌ” సినిమాను నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ మీద విడుదల చేసారు. కానీ నాగార్జున తన సినిమాకు పోటీగా విడుదలైన “గూఢచారి” చిత్రాన్ని మెచ్చుకుంటూ ట్విట్టర్ వేదికగా ట్విట్ చేసారు.

అంతే కాకుండా నాగార్జున గూఢచారి సినిమా సక్సెస్ మీట్ కు కూడా రానున్నట్లు తెలుస్తుంది. తన సినిమాకు పోటీగా విడుదలైన మంచి విజయం సాధించడంతో నాగార్జున ఆ సినిమాను పొగడ్తలతో ముంచెత్తి సక్సెస్ మీట్ కు వెళ్తున్నాడంటే నాగార్జునను మెచ్చుకొని తీరాల్సిందే. “గూఢచారి” ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టడంతో ఈరోజు విడుదలైన నితిన్ “శ్రీనివాస కళ్యాణం” కు నెగటివ్ రిపోర్ట్స్ రావడంతో సినిమా ఈ వారాంతంలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుందని తెలుస్తుంది.