ఇప్పుడంతా బయోపిక్ కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కావున ప్రముఖ నటుల జీవితం మీద మరి కొన్ని బయోపిక్‌లను తెరకెక్కించేందుకు చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఉంది. ఇదే బాటలో అక్కినేని నాగేశ్వర రావు మీద బయోపిక్ తీస్తారా? అన్న చర్చ నడుస్తుంది. ఈ విషయంపై నిన్న తిరుమల వచ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఏఎన్నార్‌ బయోపిక్‌ గురించి త్వరలో వెల్లడిస్తానన్న నాగార్జున.. త్వరలోనే తాను నటించే కొత్త సినిమా వివరాలు కూడా చెబుతానన్నారు. కాగా బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని నాగార్జున దర్శించుకున్నారు.