2002 డిసెంబర్ 20 న విడుదలైన కింగ్ నాగార్జున చిత్రం ‘మన్మధుడు’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది. ‘చి లా సౌ’ సినిమా తో హిట్ కొట్టిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఈయన దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ సినిమా తెరకెక్కుతుంది.

ఈ చిత్రం మార్చి 12న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ యూరప్ లో జరుగనుంది. దాదాపు రెండు నెలలు ఈ సినిమా కోసం నాగార్జున అక్కడే ఉండనున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో తెలియాల్సి వుంది. కాగా ‘మన్మధుడు’ సీక్వెల్ గా రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.