బిగ్ బాస్ ముగింపు దశకు వచ్చేసింది. బిగ్ బాస్ మొదట్లో అంత ఆకట్టుకోకపోయినా చివరకు వచ్చేసరికి మరింత రక్తి కట్టిస్తూ, ప్రేక్షకాదరణ గణనీయంగా పెంచుకుంటూ మంచి టి.ఆర్.పి రేటింగ్స్ సాధిస్తుంది. ఇక గత మూడు రోజులుగా బిగ్ బాస్ ఇంటికి బిగ్ బాస్ సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు వారి కుటుంబసభ్యులను కలుసుకున్న సమయంలో వారు చూపించి భావోద్వేగాలు ప్రేక్షకులను సైతం కొంత కదిలించాయి.

ఇందులో భాగంగా ఇప్పటికే తేజస్వి ఉన్నప్పుడు ఆమెతో రొమాన్స్ చేస్తూ ఆడి పాడిన సామ్రాట్ రెడ్డి… తేజస్వి వెళ్లిపోయిన తరువాత గీత మధురితో మంచి బాండింగ్ ఏర్పడింది. దీనిపై బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులలో అనేకమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. గీత మాధురి – సామ్రాట్ మధ్య ఏదో జరుగుతుందని వార్తలు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చాయి. ఇది మొత్తం కావాలనే కౌశల్ ఆర్మీ పుట్టించిందని, కౌశల్ కు ఎవరు పోటీ వస్తే వారిని బద్నామ్ చేయడానికి కౌశల్ ఆర్మీ పనిగట్టుకొని నిందలు మోపుతుందని వ్యాఖ్యానించేవారు ఉన్నారు.

Geetha madhuri Nandu

ఈ వ్యాఖ్యలపై రీసెంట్ గా నందు స్పందిస్తూ ఒక వీడియో పెట్టి, వెంటనే డెలిట్ చేయడంతో అసలు సోషల్ మీడియాలో మరో సారి గీత మాధురి – సామ్రాట్ ల మధ్య ఏదో జరుగుతుందని వచ్చిన వార్తలపై నందు చాల ఫీల్ అయ్యాడని, నిజంగా గీత – సామ్రాట్ మధ్య ఏదైనా జరుగుతుందా అనేవి బలం చేకూరాయి. బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు కుటుంబసభ్యులను కలుసుకునే సందర్భంలో నందు – గీత మాధురిని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చేసారు.

ఇక నందు బిగ్ బాస్ హౌస్ లోనే దీనిపై గట్టిగా ఫుల్ స్టాప్ పెట్టె పనికి పూనుకొని, బిగ్ బాస్ ఎప్పటికి ఈ పిల్ల నాదే అంటూ గీత మధురిపై తన ప్రేమను వ్యక్తం చేస్తూనే బయట జరుగుతున్న పరిణామాలపై కొంత సామ్రాట్, గీత మాధురికి తెలిసేలా హింట్ ఇచ్చి వెళ్ళాడు. సామ్రాట్ తో కూడా నందు చాల చనువుగా నువ్వు సామ్రాట్ కాదు, టామీవని ఆటపట్టించేలా బిగ్ బాస్ హౌస్ లో నందు గడిపి, మేము అందరం ఒక్కటే అని, బిగ్ బాస్ అనేది ఒక గేమ్ మాత్రమే అని గీత – నందు ఎప్పటికి ఒక్కటే అని ఎవరు విడతీయలేరని ప్రేక్షకులకు తెలియచేయడానికి ప్రయత్నించాడు. నందు – గీత మాధురి వీరిద్దరి మధ్య బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సంబాషణ తరువాతైనా గీత మాధురి – సామ్రాట్ మధ్య ఏదో జరుగుతుంది అనుకుంటున్న నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపుతారో లేదో చూడాలి.