‘దేవదాస్’ సినిమా తర్వాత హీరో నాని చేస్తున్న సినిమా ‘జెర్సీ’ ఈ రోజు(బుధవారం) ఉదయం ఫిలిం నగర్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. రేపటి నుండి రెగ్యులర్‌గా షూటింగ్‌ జరుగుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళి రావా’ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి.. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

Nani Jersey