“కృష్ణగాడి వీర ప్రేమ గాధ” సినిమాతో నానికి మంచి లవ్ అండ్ మాస్ సినిమా చేసి పెట్టిన హను రాఘవపూడితో నాని మరో సినిమా చేయడానికి సన్నద్ధమయ్యాడు. కానీ ఈ మధ్య హను దర్శకత్వంలో విడుదలైన “పడి పడి లేచే మనసు” సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నాని కొంచెం ఆలోచనలో పడ్డాడని వినిపిస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన “అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ” చిత్రాలు మంచి విజయం సాధించినా ఆ తరువాత చేసిన రెండు చిత్రాలు బోల్తా కొట్టాయి.  

హను దర్శకత్వంలో వచ్చిన “లై” సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో పాటు, సాగదీసి ధోరణిలో సినిమా ఉండటంతో ప్రేక్షకులు సినిమాను పక్కన పెట్టారు. ఇక గత శుక్రవారం రిలీజ్ ఐన “పడి పడి లేచే మనసు” సినిమా కూడా మొదటి భాగం బాగున్నా రెండవ అర్ధభాగం సినిమా గాడి తప్పడంతో సినిమా ప్లాప్ టాక్ ను మూట గట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు ప్లాప్ సినిమాలను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఇప్పటికిప్పుడు నాని చేయడానికి సిద్ధంగా లేనట్లు గుసగుసలు వినపడుతున్నాయి. నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత విక్రమ్ కే కుమార్ సినిమాను కూడా ఒకే చేయడంతో ఆ సినిమా కూడా పట్టాలెక్కడానికి రెడీగా ఉంది.