మైత్రీమూవీస్ పతాకంపై నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇష్క్‌, మనం, 24, హలో లాంటి డిఫరెంట్ సినిమాలును డైరెక్ట్ చేసాడు విక్రమ్. చాలా రోజులుగా విక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తుండటంతో విక్రమ్‌ నాని తో సినిమాకు రెడీ అవుతున్నాడు.

కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో కాస్త వెనుకపడ్డ నాని.. ఇప్పుడు శరవేగంగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే చిత్ర యూనిట్ అధికార ప్రకటన చేయనున్నారు.