గత శుక్రవారం అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకొని తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఈ సినిమా సినీ పరిశ్రమతో పాటి, రాజకీయ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది. గూఢచారి సినిమాపై తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తన స్పందన తెలియచేయాడు.

స్పై థ్రిల్లర్ గా వచ్చిన గూఢచారి సినిమాను చూసి చాల ఎంజాయ్ చేసానని, సాంకేతిక నిపుణులతో పాటు ఆర్టిస్టులు కూడా బాగా కష్టపడ్డారని, హీరో అడవి శేష్, శోభిత దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, శశికిరణ్ మరియు మిగిలిన కీలక నటులంతా మంచి ఎఫర్ట్ పెట్టారని వారికి నా అబినందనలని ట్విట్టర్ వేదికగా తెలియచేసాడు.