అరవింద్‌ స్వామి, సం‍దీప్‌ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా నరకాసురుడు. కార్తిక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. 16 సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్‌ నరేన్‌ మరోసారి నరకాసురుడుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అరవింద్‌ స్వామి, సందీప్‌ కిషన్‌, శ్రియలు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లు చేస్తున్నారు. కాగా విడుదలైన ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగు వర్షన్‌ను రమేష్‌ వర్మ ప్రొడక్షన్‌ లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా విడుదల చేయనున్నారు.