నయనతార ఎంత ఘాడంగా ప్రేమిస్తుందో, అంత తొందరగా తనను ప్రేమలో ముంచిన ప్రేమికులు దూరంగా వెళ్లిపోతున్నారు. ఇప్పటికే నయనతార ఇద్దరిని ప్రేమించి పెళ్లిపీటలు ఎక్కాలని నిర్ణయించుకోగానే వారిద్దరూ నయనతారకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. వారిద్దరూ ఒకరు శింబు కాగా, మరొకరు ప్రభుదేవా… ఆ గాయాల నుంచి కోలుకొని నయనతార కొత్త ప్రేమికుడితో గత కొద్ది కాలంగా చెట్టా పట్టాలేసుకొని తిరిగుతుంది. అతడే తమిళ డైరెక్టర్ “విగ్నేష్ శివన్”.

నిన్న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరిద్దరూ కలసి దిగిన ఫోటో నయనతార తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేసింది. నయనతార విగ్నేష్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా, రెండు సార్లు పెళ్లి పీటల వరకు వెళ్లిన పెళ్లి వెనక్కు పోవడంతో పాటు వారిద్దరూ హ్యాండ్ ఇవ్వడంతో, ఇప్పుడు ఏకంగా సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి పెళ్లి పీటలెక్కే యోగ్యం ఇంకా రాలేదనుకుందో లేక పెళ్లి అనే మాట ఎత్తితే తన కొత్త ప్రేమికుడు “విగ్నేష్ శివన్ ఎక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్తాడనుకుందో కానీ ప్రస్తుతానికి సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.

Nayanatara - Vignesh Shivan