రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగుఇండస్ట్రీకి కొంత దూరం జరిగి తమిళ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతుంది. బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఈనెల 11న లాంఛనంగా మొదలైన “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం చరణ్ – ఎన్టీఆర్ లపై ఒక 10 రోజులు షూట్ చేయనున్నారన్న సంగతి తెలిసిందే. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ “ఆర్ఆర్ఆర్” టీమ్ కు శుభాకాంక్షలు అందచేసింది.  

రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పడైతే “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పిందో అప్పటి నుంచి ఎన్టీఆర్ – చరణ్ అభిమానులు నీకు అంత సీన్ లేదని, “ఆర్ఆర్ఆర్” సినిమాలో హీరోయిన్ గా నటించడానికి బిస్కట్స్ వేస్తున్నావంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ మొదలైన తరువాత ఎంతో మంది సెలెబ్రేటిస్ ఈ సినిమాకు శుభాకాంక్షలు తెలియచేసారు. రకుల్ కూడా అందుకు మినహాయింపు కాదనట్లు విషెష్ చెబితే ట్రోల్ చేయడానికి ఏముందని కొంత మంది రకుల్ కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. గతంలో ఒకసారి మంచు లక్ష్మితో కలసి దిగిన ఫొటోను చూసి లెస్బియన్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్ చేసారు.