సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. సవ్యసాచి ఫ్లాప్ అయినా నిధి అగర్వాల్ కెరీర్ మాత్రం జోరుగా ఉంది. ఆ సినిమాలో నిధి అగర్వాల్ యాక్టింగ్ పర్వాలేదనిపించింది. సవ్యసాచి సెట్స్ పై ఉండగానే ‘మిస్టర్ మజ్ను’లో అఖిల్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి ఎంటరైంది. అలాగే తనకు రామ్ చరణ్, బన్నీతో కలిసి నటించాలని ఉందంటూ ప్రకటించింది నిధి.