నితిన్ తన కెరీర్ ను అద్భుతంగా మొదలు పెట్టి తరువాత కొన్ని సంవత్సరాలు పాటు హిట్ కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూశాడు. చివరకు దర్శకుడు విక్రమ్ కుమార్ పుణ్యమాని “ఇష్క్” సినిమాతో హిట్ కొట్టి ఊపిరి పీల్చుకున్నాడు. తరువాత రిలీజ్ అయిన ఒకటి రెండు సినిమాలు కూడా అడపా దడపా హిట్స్ సాధించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అఆ” సినిమా అయితే ఏకంగా 40 కోట్ల క్లబ్బులో చేరింది. ఆ సినిమా తరువాత నితిన్ వెనుతిరిగి చూడాల్సిన పని లేదని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకున్నారు.

“అఆ” సినిమా 40 కోట్ల క్లబ్ చేరడంతో హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ బారి బడ్జెట్ తో వచ్చిన “లై” సినిమా నిర్మించి దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ సినిమా ఖర్చులో సగం కూడా వసూలు కాకపోవడంతో నితిన్ ప్రతిష్ట ఒక్క సారిగా మసకబారిపోయింది. ఇక ఆ సినిమాతో మొదలైన నితిన్ ప్లాపుల పరంపర తరువాత త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలసి నిర్మించిన “చల్ మోహన్ రంగ” తో మరో డిజాస్టర్ తన కథలో వేసుకున్నాడు.

ఇక లాభం లేదనుకొని తన రెండవ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు మంచి జోరు మీద ఉండటంతో రాజు గారి ప్రొడక్షన్ లో “శ్రీనివాస కళ్యాణం” సినిమా చేసాడు. ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి పాజిటివ్  బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది. చాల రోజుల తరువాత నితిన్ తో సినిమా తీసి దిల్ రాజు చేతులు కాల్చుకున్నాడనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈ సినిమా చూడటం కన్నా, ఇంట్లో ఎవరకి వారు వాళ్ళ “పెళ్లి క్యాసెట్” చూడటం మేలు అన్నట్లు సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సతీష్ విగ్నేష్.

ప్లాపుల నుంచి హిట్ ట్రాక్ ఎక్కినా నితిన్ కు మరలా వరుస పెట్టి ప్లాపులు వెక్కిరించడంతో నితిన్ కు హిట్ ఇచ్చే దర్శకుడి కోసం తీవ్రంగా వెతుకులాట మొదలు పెట్టారు. పాపం ఎంత కష్టపడినా ఏమి ఉపయోగం సరైన కథ ఎంపిక చేసుకోక పోతే వరుసగా హ్యాట్రిక్ ప్లాపులతో పాటు, డబల్ హ్యాట్రిక్ ప్లాప్స్ కొట్టిన ఆశ్చర్య పోవలసిన పని లేదు.