Tuesday, October 8, 2024

Jabardasth Show : అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.. జబర్దస్త్‌కి కొత్త జడ్జ్ గా ఫైర్ బ్రాండ్

- Advertisement -


Jabardasth Show : బుల్లితెరలో జబర్దస్త్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేమస్ అయిన చాలా మంది కమెడియన్లు ఈ బుల్లితెర కామెడీ షో నుండి వచ్చినవారే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాపులర్ అయిన కమెడియన్స్ అందరూ ఈ షో నుండి తప్పుకోవడం, కొత్త కమెడియన్లు పెద్దగా రాణించలేకపోవడంతో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలను కలిపి ఒకే షోగా నడుపుతున్నారు. దీనికి కృష్ణ భగవాన్, కుష్బూ న్యాయనిర్ణేతలుగా, రష్మి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ ఇటీవలి ప్రోమోలో కృష్ణ భగవాన్ కనిపించలేదు. ఆయన స్థానంలో కొత్త జడ్జ్ వచ్చారు. అతడెవరో, అతని నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.

ఇంతకుముందు జబర్దస్త్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో అనే రెండు షోలు ఉండేవి. ఇప్పుడు ఆ రెండు షోలతో కలిపి జబర్దస్త్ అనే షో చేస్తున్నారు.. అయినా దానికి ఆడియన్స్ ఇచ్చే ప్రాధాన్యత అయితే ఏం తగ్గలేదు. అలాగే జడ్జీలుగా ఉన్న కృష్ణ భగవాన్, కుష్బూ లు కూడా షోలో తమదైన శైలిలో పంచులు వేస్తూ బాగానే కామెడీ పండించేవారు. అయితే తాజాగా వచ్చిన జబర్దస్త్ ప్రోమోలో కృష్ణ భగవాన్ కనిపిచంలేదు. ఆయన స్థానంలో కొత్త జడ్జీ వచ్చారు అంటూ పరిచయం చేశారు. ఆయన ఎవరో కాదు… ఒకప్పటి హీరో, ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 లో టాప్ 5 వరకు వెళ్లిన శివాజీ.

బిగ్ బాస్ వెళ్లిన తర్వాత శివాజీ కాస్త స్లో అయ్యారు. అంతకు ముందు పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటూ ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. ఆపరేషన్ గరుడ అంటూ కొన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు ఇచ్చేవారు. అలాగే మరో పార్టీకి బహిరంగంగానే మద్దతు పలికారు. అప్పట్లో శివాజీ యాక్టింగ్ ఫీల్డ్‌ని వదిలి రాజకీయాల్లోకి వస్తారని, ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపించాయి. కానీ, తరువాత అతను బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. అక్కడ అతను పెద్దన్న పాత్రను పోషించడమే కాకుండా, పల్లవి ప్రశాంత్‌ను గెలవడానికి చాలా సాయపడ్డాడు. ఇటీవలే 90ఎస్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాజీ ఇప్పుడు జబర్దస్త్ షోతో వారానికి రెండు సార్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. శివాజీ కామెడీ టైమింగ్ కృష్ణ భగవాన్ తరహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాప్ వస్తే పంచ్ లు విసురుతూ మళ్లీ ఎంటర్ టైన్ చేస్తుంటారు. ప్రస్తుతం యాంకర్ రష్మీ కాగా, జడ్జిలుగా శివాజీ, కుష్బూ ఉన్నారు.

ఈ షో నుండి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ టీమ్ వెళ్లిపోయింది. ఈ ముగ్గురిలో సుధీర్, శ్రీను ఇతర షోలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ ప్రసాద్ ఇతర షోలు కూడా చేస్తున్నా.. జబర్దస్త్ వదల్లేదు. కాగా, ఇప్పుడు ప్రసారం అవుతున్న షోలో 6 టీమ్‌లు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!