నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘కథా నాయకుడు’. ఈ సినిమా జనవరి 9 న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ నటించారు. ఇక అక్కినేని పాత్రలో సుమంత్ నటించారు.

భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజునే మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఆంద్ర, తెలంగాణాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ రూ. 7.60కోట్ల వచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క ఓవర్సీస్ లోను ప్రీమియర్ షోస్ తోనే దాదాపు 3 మిలియన్ల క్రాస్ చేసింది. మొదటి రోజు అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టిందని చెబుతున్నారు. కాగా ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం ‘మహా నాయకుడు’ ను ఫిబ్రవరి 8 న రిలీజ్ చేయనున్నారు.