నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘యన్‌టిఆర్’ బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ఏఎన్నార్‌ 94వ జయంతిని పురస్కరించుకుని సినిమాలోని ఏఎన్నార్‌ లుక్‌ను సుమంత్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. స్వతహాగా సుమంత్ ఏఎన్నార్ పోలికల్ని పుష్కలంగా కలిగి ఉండటంతో ఆయన గెటప్లో ఇట్టే ఇమిడిపోయారు. నడి వయసులో ఏఎన్నార్ ఎలా ఉండేవారో అలానే ఉన్నారు. లుక్ చూసిన చాలా మంచి సుమంత్ నాగేశ్వరావుని గుర్తుచేశారని అంటున్నారు. ఇకపోతే టీమ్ ఈరోజు సాయంత్రం 4 గంటల 17 నిముషాలకు మరొక లుక్ ను రిలీజ్ చేయనుంది. ఇందులో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కలిసి ఉంటారట.