టాలీవుడ్‌ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న బ‌యోపిక్ ఎన్టీఆర్‌. క్రిష్ డైరక్షన్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌ గా బాలకృష్ణ నటిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీకి సంబధించి కొన్ని లుక్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌ల చేయ‌లేదు. అయితే ఇప్పుడు విద్యాబాలన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో బ‌స‌వ‌తార‌కం లుక్‌ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నేనేం చూస్తున్నాను అనే కామెంట్ పెట్టింది. అలాగే దసరా పండగ నాడు ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించి మరో లుక్‌ రాబోతోంది.