ఎన్టీఆర్ బయోపిక్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అనుకున్నట్లుగానే జనవరి 11న సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కంకణం కట్టుకుంది. దీనిలో భాగం గానే ఒకొక్క పాత్రపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు హరికృష్ణ పాత్రపై ఒక క్లారిటీ వచ్చినట్లు కనపడుతుంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత హరికృష్ణ పాత్ర చాల కీలకమైంది. ఎన్టీఆర్ ప్రచారం చేసే సమయంలో చైతన్య రథాన్ని స్వయంగా నడిపి ఎన్టీఆర్ కు బాసటగా నిలిచారు. అలాంటి హరికృష్ణ పాత్రకు ఎన్టీఆర్ కుమారుడైన కళ్యాణ్ రామ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

బాలకృష్ణకు… కళ్యాణ్ రామ్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులను తీసుకోకపోవడంతో కొంత విమర్శలు వచ్చాయి. వాటికీ ఫుల్ స్టాప్ పెట్టె క్రమంలో కళ్యాణ్ రామ్ ను ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటింపచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని చెబుతున్నారు.

మరో వైపున ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే పరిటాల రవి క్యారెక్టర్ సినిమాలో లేదని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సంక్షోభం సమయంలో కూడా పరిటాల రవి ఎన్టీఆర్ వైపునే నిలబడ్డాడు. ఎన్టీఆర్ అంటే మొదటి నుంచి గౌరవం పెంచుకున్న పరిటాల రవి ఆ సమయంలో ఎన్టీఆర్ పక్కన నిలబడి కొంత కీలకంగా వ్యవహరించాడు. తరువాత కాలంలో చంద్రబాబు పక్షాన చేరిన విషయం తెలిసిందే. పరిటాల రవి పాత్రపై ప్రస్తుతానికైతే క్లారిటీ లేదని, దాదాపుగా ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ బయోపిక్ లో ఉండకపోవచ్చని తెలుస్తుంది.