ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ‘కథా నాయకుడు’, ‘మహా నాయకుడు’ అనే రెండు భాగాలుగా విడుదల అవుతోంది. ఈ బయోపిక్ చిత్రం నుండి మరో స్టిల్ వచ్చింది. అయితే ఈ సారి ఆసక్తికరంగా ‘వేటగాడు’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఆకు చాటు పింద తడిసె’ను బాలకృష్ణ, రకుల్ ప్రీత్ సింగ్ ల పై చిత్రీకరించారు. తాజాగా ఆ పాటలోని స్టిల్ ని రకుల్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర మొదటి పార్టు కథానాయకుడిని సంక్రాంతికి రిలీజ్ చెయ్యబోతున్నారు.