ఒకప్పుడు కథానాయకుడిగా వెండితెరను ఒక ఊపు ఊపిన నటుడు ఎన్టీఆర్‌. ఆయన బయోపిక్ అనగానే ఎన్నో పాత్రలు, ఎన్నో సంఘటనల కలయికగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్‌’ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో రానా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, నాగిరెడ్డి పాత్రకి గాను ప్రకాశ్ రాజ్ ను, బీఏ సుబ్బారావు పాత్రకి గాను సీనియర్ నరేశ్ ను ఎంపిక చేశారు.

ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ‘ఎన్టీఆర్’ హవా మొదలైపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ డిమాండ్ పెరుగుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 12 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ బయోపిక్‌లో కృష్ణ పాత్ర కోసం మహేశ్‌బాబును, ఏఎన్నార్‌ పాత్ర కోసం నాగచైతన్యను నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags: NTRBIOPIC, Nandamuri Balakrishna, Krish, Vidya balan, Prakash Raj