Tuesday, September 10, 2024

తొలిసార్ జగన్‌తో మాట్లాడిన ఎన్టీఆర్…. థాంక్యూ సార్ అంటూ ట్విట్

- Advertisement -

జగన్‌ ట్విట్‌కు రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్ .. థాంక్యూ సార్ అంటూ..

ఎన్టీఆర్, జగన్ ఇద్దరు కూడా రెండు ధృవాలకు చెందిన వ్యక్తులు. ఒకరు రాజకీయాల్లో మేటిగా సాగుతుంటే.. మరొకరు సినిమాల్లో రారాజుగా ఎదుగుతున్నారు. ఇద్దరు కూడా తమకు సంబంధించిన పనుల్లో పూర్తిగా నిమగ్నమైయ్యారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం ఎన్ని పనులు చేసినప్పటికి ఎన్టీఆర్ గురించి వైసీపీ నాయకులు విమర్శలు చేసింది లేదు. ఇదే సమయంలో అటు ఎన్టీఆర్ కూడా ఎప్పుడు వైసీపీ పాలన గురించి మాట్లాడింది కూడా లేదు. అయితే వీరిద్దరు ఎప్పుడు కలుస్తారా అని చాలామంది ఎదురు చూశారు. ఆ మధ్య సినిమా టికెట్ల రేట్ల విషయంలో జగన్ వద్దకు తెలుగు సినిమాకు చెందిన ప్రముఖులందరు వచ్చారు. రాజమౌళి, కొరటాల, ఆర్ నారాయణమూర్తి, హీరోలు ప్రభాస్, మహేష్, చిరంజీవి వంటి వారు వచ్చి జగన్‌ను కలిశారు.

ఈ లిస్ట్‌లో మొదట ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. కాని సడన్‌గా ఎన్టీఆర్ ఈ సమావేశానికి దూరం ఉన్నారు. టీడీపీ నుంచి ఎక్కడ విమర్శలు వస్తాయో అని భయంతోనే ఎన్టీఆర్ ఈ సమావేశానికి రాలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సీఎం జగన్ చేసిన ట్విట్‌కు ఎన్టీఆర్ రిప్లై ఇవ్వడం అటు సినిమా వర్గాలతో పాటు, ఇటు రాజకీయవర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అసలు జగన్‌కు ఎన్టీఆర్ ఎందుకు రిప్లై ఇచ్చారో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించారు. తాజాగా ఈ సినిమా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు పాటకు అంర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతిష్ఠాత్మక గోల్డన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాట వెనుక ఆర్ఆర్ఆర్ టీం కష్టం చాలా ఉంది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు రావటంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్‌తో పాటుగా రాజమౌళి – కీరవాణి సహా మొత్తం టీంను సీఎం జగన్ అభినందించారు. తెలుగు ఖ్యాతి ప్రపంచానికి చాటారని అభినందించారు. ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయం గర్వకారణమని పేర్కొన్నారు. దీనికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ థాంక్యూ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. అదే విధంగా హీరో రామ్ చరణ్ కూడా సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి జగన్‌కు ట్విట్ చేశారని.. ఎన్టీఆర్‌ను టీడీపీ నేతలు ఎలా టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!