Tuesday, October 8, 2024

Bigg Boss 8 Telugu : అయ్యో సోనియా లైఫ్ లో ఇన్ని కష్టాలా.. అతను చూపించిన నరకానికి..

- Advertisement -

Bigg Boss 8 Telugu : తెలుగులో టెలికాస్ట్ అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్. సోనియా ఆకుల అనే కంటెస్టెంట్ ఈ సీజన్‌లోనే హైలైట్ గా అవుతుంది. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంది. అయితే ఆమె పాజిటివ్ కంటే నెగెటివ్‌గానే వినిపిస్తుంది. అయిందానికి కాని దానికి రెస్పాండ్ అవుతుంది. ఇంట్లో తను ఒక్కదానినే అన్నట్లు సందడి చేస్తుంది. మాటమాటకు విష్ణు ప్రియపై పడి ఏడుస్తుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ బేబక్క తను చూసినా, పక్కన నిలుచున్నా, నడుస్తుననా ప్రాబ్లం అంటుంది అంటూ సోనియా పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆమె హౌసులో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక అసలు విషయానికొస్తే.. ఎప్పుడూ కోపంగా ఉండే సోనియాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉందట. ఏంటి నిజమా అని జనాలు ఆశ్చర్య పోతున్నారు. నిన్నటి ఎపిసోడ్ వరకు అందరి మీద అరుస్తూ కనిపించే ఈ అమ్మడికి ఒక లవ్ స్టోరీ ఉందా అని తెలుసుకుని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఎపిసోడ్ లో సోనియా తన లవర్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో జరిగిన విషయాలను గమనిస్తే.. లో ఎమోషనల్ సర్ ప్రైజ్ చేసి బిగ్ బాస్ అందరినీ ఏడిపించారు. ఆ తర్వాత సోనియా, నిఖిల్ ఒకే దగ్గర చేరి కాసేపు మాట్లాడుకున్నారు. ఆ టైంలో సోనియా ఆకుల బాగా ఎమోషనల్ అయింది. ముందుగా నిఖిల్ అంతా ఓకే కదా అని అడుగుతాడు. అయితే సోనియా అతని ప్రశ్నకు సమాధానంగా అవును.. కానీ ఇంకేం వస్తాయో తెలియట్లేదంటూ చెప్పుకొచ్చింది. ఆ వెంటనే నిఖిల్ నువ్వేంటో అతనికి కంప్లీట్ గా తెలుసు కదా అని అడుగుతాడు. దానికి ఒక్కసారిగా ఎమోషనల్ అయి ఏడ్చేసింది సోనియా.. అయితే తన ప్రియుడితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. అంత ప్రేమ ఉన్న ఆమె తనతో ఎందుకు విడిపోయారు. అతగాడు అంత నరకం చూపించాడా లేక మరేదైనా కారణం ఉందా అనేది మాత్రం తెలియలేదు.

ఇక హౌస్ సోనియా పృథ్వీ, నిఖిల్ లతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుందా అన్నట్లుగా కనిపిస్తోంది. సోనియా ఎక్కువగా హౌసులో వీళ్ల ఇద్దరితోనే కనిపిస్తుంది. అభయ్ నవీన్ తో కూడా మంచి బాండింగ్ ఉన్నప్పటి కీ వాళ్ల ఇద్దరి రిలేషన్ కేవలం ఫ్రెండ్షిప్ లాగే కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్స్ తన బాయ్ ఫ్రెండ్ చూస్తే ఇక షాక్ అవ్వడం పక్కా.. ఏది ఏమైనా ఈమె హౌసులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతుంది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్తారో ఆసక్తిగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్ భాషా ఎలిమినేటి వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో అంటేనే ఎవరూ ఊహించనిది జరుగుతుంది. మరి ఎవరు హౌసు నుంచి వెళ్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!