మాస్ హీరో విశాల్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం పందెం కోడి2. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారి అంచనాలతో అక్టోబర్ 18న రిలీజ్ అవుతుంది. 2005 లో వచ్చిన పందెం కోడి సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వస్తుంది. ఓ జాతర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ మధ్య భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ.. 2018 నా జీవితంలో మరచిపోలేని సంవత్సరం. ఈ పుట్టినరోజు స్పెషల్‌ ఏంటంటే.. నా బర్త్‌డే తర్వాత రోజే నేను నటించిన చిత్రం ‘పందెంకోడి 2’ రిలీజ్‌ అవుతోంది. కాబట్టి నాకు ఆల్రెడీ బర్త్‌డే గిఫ్ట్‌ ఓ రోజు ముందు లభించినట్లే అని ఆమె సంతోషపడుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఠాగూర్‌’ మధు విడుదల చేస్తున్నారు.