పందెం కోడి సినిమా అప్పట్లో ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసే ఉంటుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పందెం కోడి 2 సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ఈరోజు రీలీజయ్యింది. ఈ సినిమా కూడా పందెం కోడి సినిమా వలే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న దానిలో సందేహం లేదని టీజర్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. హరి దర్శకత్వంలో వస్తున్న పందెం కోడి 2 సినిమా టీజర్ తరువాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. హరి సినిమాలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది స్క్రీన్ ప్లే, ఈ సినిమాలో కూడా మంచి రేసీ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో అక్టోబర్ 8వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.