మంచు విష్ణు “ఓటర్” సినిమా షూటింగ్ తో మంచి బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇకపోతే మంచు వారి పైసలు ఎప్పటి నుంచో పరశురామ్ దగ్గర ఉండిపోయాయి. ఆగష్టు 15న విడుదలైన “గీత గోవిందం” సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఎప్పుడో మంచు వారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని సినిమా చేస్తానన్న పరశురామ్ హామీ ఇవ్వడంతో ఇప్పటికి గుర్తు వచ్చాడు మన దర్శకుడు. మొదటగా మాకే సినిమా చేయాలనీ మంచు ఫ్యామిలీ పరశురామ్ మీద ఒత్తిడి చేస్తున్నట్లు ఉంది. కానీ పరశురామ్ తో గీత ఆర్ట్స్ మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఒక నాలుగు నెలలో సినిమా పూర్తి చేసి పరశురామ్ ని వదిలేస్తామని గీత ఆర్ట్స్ మంచు కుటుంబాన్ని అడిగినట్లు తెలుస్తుంది.

మంచు కుటుంబం నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది. పరశురామ్ చెప్పిన ఒక కథ గీత ఆర్ట్స్ సంస్థ లాక్ చేసారని, ఆ సినిమాను వరుణ్ తేజ్ తో నిర్మించడానికి గీత ఆర్ట్స్ రెడీ గా ఉందని, మంచు వారి దగ్గర ప్రస్తుతానికి కథ సిద్ధంగా లేదని, ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు సినిమా కంప్లీట్ చేస్తామని గీత ఆర్ట్స్ వాదనగా వినపడుతుంది. ఈ పరిణామాల మధ్య ఎలాంటి మలుపులు తిరుగుతాయో, మోహన్ బాబు నాలుగు నెలలే కాబట్టి పరశురామ్ ని గీత ఆర్ట్స్ లో సినిమా చేసుకోవడానికి ఒకే చేస్తాడో లేక ఏదైనా పేచీ పెడతారో చూడాలి. అందరి దగ్గర అడ్వాన్స్ లు పుచ్చుకొని, అందరకి సినిమాలు చేస్తానని ఒప్పుకున్న తరువాత ఏదైనా సినిమా ఆ దర్శకుడిది సూపర్ హిట్ అయితే అందరూ ఒక్కసారే గొడవ చేసి హిట్ సినిమాను కాష్ చేసుకోవాలని చూస్తారు. ఇప్పుడు పరశురామ్ పరిస్థితి కూడా అలానే తయారైంది.