సుశాంత్ నటించిన ‘చిలసౌ’ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఈయనను కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది. మన్మధుడుకి సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ రెడీ అయ్యింది. కాగా ‘RX100’ తో సంచలనం రేపిన హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్ ఈ సినిమా ఆడిషన్ కు హాజరయిందట. ఆడిషన్ నచ్చడం తో రాహుల్ ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాగార్జున ఈ హీరోయిన్ ని ఫైనల్ చేయవలసి ఉంది. మన్మధుడు 2 లో పాయల్ ఒకే అయితే టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కావడం ఖాయమంటున్నారు.