నాని హీరోగా వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ‘ దారిచూడు, తెన్ను చూడు మామా’ అంటూ పాట పాడి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెంచలదాస్.. ఆ తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. లేటెస్ట్ గా వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ కోసం పెంచలదాస్ ఓ భావోద్వేగ పాటను రాశారు.

సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట చాల అద్భుతంగా ఉంటుందని.. ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుందంటున్నారు. ముఖ్యంగా సీమవాసులను టచ్ చేస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిడివి 1.57 నిముషాలు వచ్చిందని తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 8 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.