కాస్టింగ్ కోచ్ ఆరోపణలతో బెంబేలెత్తిపోతున్న తెలుగు చిత్ర సీమపై పూనమ్ కౌర్ మరో పిడుగులాంటి వార్త వేసింది. తనను ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికొచ్చి ఒంటరిగా కలవమన్నాడని చెప్పింది. ఆ స్టార్ ప్రొడ్యూసర్ పేరు బయటకు చెప్పకుండా పూనమ్ కౌర్ చేసిన ఆరోపణలపై ఆ ప్రొడ్యూసర్ ఎవరై ఉంటారని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ నిర్మాత తనను ఇంటికొచ్చి ఒంటరిగా కలవమంటే తాను తన తల్లిని వెంటబెట్టుకొని అతని వద్దకు వెళ్లానని ఆ నిర్మాత చిరాకుగా సరిగ్గా మాట్లాడలేదని పూనమ్ కామెంట్ చేసింది. తెలుగులో పలు చిత్రాలలో పూనమ్ అడపాదడపా నటిస్తుంది. ప్రస్తుతానికి పూనమ్ చేతిలో సినిమాలు ఉన్నట్లు కనిపించడం లేదు.

నిర్మాత మొదటగా పూనమ్ ఇంటికి వెళ్లి మీరు బాగా నటిస్తారని, మీరు స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం కల్పిస్తానని ఒకేసారి వచ్చి కలవమని చెప్పాడని, తీరా తన తల్లిని తీసుకొని వెళ్లేసరికి నిర్మాత మొహం చాటేసాడని, స్టార్ హీరోయిన్లు కూడా బయట సంతోషంగా ఉన్నా, లోపల ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని పూనమ్ తెలియచేసింది. పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలతో శ్రీరెడ్డికి మరో అస్త్రం దొరికిందని చెప్పుకోవచ్చు. కాస్టింగ్ కోచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంత కాదు, పూనమ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ శ్రీరెడ్డికి ఆ నిర్మాత ఎవరో తెలిస్తే ఎటువంటి మొహమాటం లేకుండా బయటపెట్టే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.

Tags : poonam kaur, Casting Couch, Srireddy, Poonam Kaur comments on Producer, Srireddy Commnets on Casting Couch