ఆర్ఎక్స్ 100 సినిమాకు క్రిటిక్స్ రివ్యూలతో పనిలేకుండా తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపేస్తోంది. బుల్లెట్ సౌండ్ బీటింగ్ ఏవిధంగా ఉంటుందో ఆర్ఎక్స్ 100 సినిమా మోత కూడా అదేవిధంగా ఉంది. సినిమా విడుదలై ఒక వారం గడిచి, రెండో వారంలో మంచి సినిమాలు విడుదలైనా, ప్రేక్షకులు ఆర్ఎక్స్ 100 సినిమా వైపే మొగ్గు చూపుతూ బ్రహ్మ రధం పడుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా టైమ్ లో దర్శకుడు సందీప్ వంగా కన్నా ఎక్కువ పేరు విజయ్ దేవరకొండకు వచ్చింది, దానికి కారణం విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషయిన్స్ లో అతను వాడిన బోల్డ్ మాటలే అంత పేరు తీసుకువచ్చాయి. ఇక ఆర్ఎక్స్ 100 విషయాన్ని వస్తే సినిమా దర్శకుడు అజయ్ భూపతికి ఎక్కువ పేరు వచ్చింది. దానికి కారణం అజయ్ భూపతి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కావడం ఒక విశేషమైతే, రామ్ గోపాల్ వర్మలాగా తాను కూడా ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పడం అజయ్ భూపతి స్టైల్ అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి వర్మ శిష్యుడు మాత్రమే కాదని అతను ప్రభాస్ కు బంధువు కూడా అని తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా ప్రభాస్ – అజయ్ భూపతికి ఏమైనా రిలేషన్ ఉందా అంటూ పెట్టిన ట్విట్ వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన అజయ్ భూపతి మా వైఫ్ కజిన్ ప్రభాస్ గారికి బంధువులు, అలా ఆయనతో నాకు బంధుత్వం ఉంది. కానీ మాది చాల దూరపు బంధురికమని, ఇప్పటి వరకు ప్రభాస్ ను ఎప్పుడు కలవలేదని, త్వరలో కలుస్తానని నమ్ముతున్న అని అజయ్ భూపతి తెలియచేసాడు. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత అజయ్ భూపతి కోసం చాల మంది నిర్మాతలు, హీరోలు సినిమా తీయడానికి ఆసక్తి చూపించారు. కానీ అజయ్ భూపతి తన తదుపరి సినిమా హీరో నితిన్ తో తీస్తున్నట్లు తెలుస్తుంది.

Tags : Prabhas, Ajay Bhupathi, RX100, Payal Rajput, Ramgopal Varma